Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

13-04-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మీర్‌పేటలో భూ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన బాధితుడి నుంచి మద్యం సీసాలు డిమాండ్ చేసిన ఎస్సై నాగభూషణం వ్యవహారం సంచలనంగా మారింది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారి ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.11 గజాల స్థలం వివాదంలో బాధితుడికి సహాయం చేయాల్సింది పోయి, ఫోన్ చేసి మరీ మద్యం పంపించాలని ఒత్తిడి చేసిన ఆడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారి ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్, ఎస్సై నాగభూషణంను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News