Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:31 AM

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

21-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

లైసెన్స్ సర్వేయర్లతో సమీకృత కలెక్టరేట్‌లో సమావేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

గ్రామాలలో భూమి కొలతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన మొదటి బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల 45 రోజుల శిక్షణ పూర్తైన సందర్భంగా, బుధవారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై మాట్లాడుతూ, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు నూతన నైపుణ్యాలతో భూభారతి, ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి ఖచ్చితమైన నివేదికలు అందించాలని సూచించారు. భూ కొలతల్లో స్పష్టత, స్థిరమైన పరిష్కారం ఉండేలా పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో తహసిల్దార్‌లు, జిపిఓల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి, రైతుల్లో విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి, సూర్యాపేట జిల్లాను భూమి రికార్డుల నిర్వహణలో ముందు వరుసలో నిలబెట్టేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News