Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:42 PM

భారత రాష్ట్ర సమితికి గుడ్‌బై

భారత రాష్ట్ర సమితికి గుడ్‌బై

భారత రాష్ట్ర సమితికి గుడ్‌బై
06-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్ పార్టీలోకి నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ చేరిక

జాతీయ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిని వీడి నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చి పలువురు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతం రాజేష్ రెడ్డి విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నూతనంగా పార్టీలో చేరిన నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను వివరించి, అభ్యర్థి గెలుపుకు శ్రమిస్తామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రజా పాలనను మరింత బలోపేతం చేస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిని అభినందిస్తూ, వారి సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని వెల్లడించారు.

Sthanikam

భారత రాష్ట్ర సమితికి గుడ్‌బై

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News