Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:25 PM

భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా

15-02-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నేలకొండపల్లి:

భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటంతో హాజరుకాలేకపోయినప్పటికీ, తన శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రివర్యుల సహకారంతో కూసుమంచి శిబిర కార్యాలయ బాధ్యులు భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆదాయ పరిశీలకుడు మధుసూదన్, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బి జె పి పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News