Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

భగత్‌సింగ్‌కు పోరాటమే నిజమైన నివాళి: జూలకంటి రంగారెడ్డి

23-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భగత్‌సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

స్థానిక సుభాష్ సెంటర్‌లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు విస్తరిస్తున్నాయని, బలహీన దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విమర్శించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్‌సింగ్ వంటి విప్లవ వీరులు ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదం పెరిగి లౌకిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భగత్‌సింగ్ స్ఫూర్తితో అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పుట్టల ఉదయ్‌కుమార్, శానగొండ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సిపిఎం నాయకులు జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

భగత్‌సింగ్‌కు పోరాటమే నిజమైన నివాళి: జూలకంటి రంగారెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News