Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

23-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముచ్చర్ల (ఖమ్మం జిల్లా),

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

పివైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు మరణించి దాదాపు శతాబ్దం గడిచినా దేశంలో నిజమైన స్వాతంత్ర్యం సాధించలేదని వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్‌లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం దేశానికి అవసరమని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, యువత ఈ పరిస్థితులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దేశ భవిష్యత్తు కోసం యువత మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని, భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ ఖమ్మం జిల్లా నాయకులు కోలా దర్గయ్య, కోటేష్, శేఖర్, గోపి, నాగులుమీరా, వెంకన్న, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News