Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి

17-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలో బైక్ ర్యాలీ

నల్లగొండ,

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల ఆశయాల సాధన కోసం విద్యార్థులు, యువకులు ముందుకు రావాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ పిలుపునిచ్చారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల వర్థంతి సందర్భంగా విద్యార్థి, యువజన స్మారకోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు దొడ్డికొమరయ్య భవనం నుంచి ప్రకాశం బజార్ క్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగాలు చేయని వ్యక్తులను ప్రచారం చేస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు.

కేవలం 23 సంవత్సరాల వయస్సులో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు భారత రత్న ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. వారి స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు సమాజంలో మార్పు తీసుకురావాలని, బలమైన పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే యువత గంజాయి, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పూలెంల్ల శ్రీకర్, సహాయ కార్యదర్శి కట్టెల లింగస్వామి, నాయకులు కోరే రమేష్, ముస్కు రవిందర్, మారుపాక కిరణ్, పంది నరేష్, సైఫ్, అరూరి ప్రణీత్, జగదీష్, కండె యాదగిరి, బొడ్డుపల్లి నరేష్, అంజి, బాలరాజు, పోకల శశి, శ్రవణ్, నవదీప్, వర్షీత్, హరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News