Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

భీమిరెడ్డి త్యాగాలు నేటి యువతకు ఆదర్శం

భీమిరెడ్డి త్యాగాలు నేటి యువతకు ఆదర్శం

భీమిరెడ్డి త్యాగాలు నేటి యువతకు ఆదర్శం
05-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గట్టికల్లు గ్రామంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహానికి శంకుస్థాపన

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ (ఎస్) మండలం, గట్టికల్లు :

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, ఎంసీపీఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యులు, అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నిలువెత్తు విగ్రహానికి గట్టికల్లు గ్రామంలో శుక్రవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, గట్టికల్లు గ్రామ సర్పంచ్ భయ్యా లింగయ్య, ఉపసర్పంచ్ సందాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మడ్డి వెంకన్న, గుండు రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

శ్రీరామ్ సాగర్ రెండో దశ సాధన ప్రదాతగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చిన్నతనంలోనే ఎర్రజెండా పట్టి ప్రజా ఉద్యమాలకు ప్రాణం పోశారని గుర్తు చేశారు. దొరల గడిలపై యుద్ధం చేసి అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పోరాడి, పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన ఘనత బి.ఎన్ గారిదేనని పేర్కొన్నారు.

సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి ముందుండి నడిపించిన బి.ఎన్ గారు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించారని, మోదుగు చెట్లకు బులెట్లు పూజించిన ఎర్రజెండా ముద్దుబిడ్డగా ఆయన చరిత్రలో నిలిచారని కొనియాడారు.

భీమిరెడ్డి త్యాగాలు వృథా కాకుండా భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా, పోరాటాల పురిటిగడ్డ గట్టికల్లు గ్రామంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరపాక ఉగ్రయ్య, బచ్చు కోటయ్య, వార్డు సభ్యులు మురపాక విష్ణు, బచ్చలకూరి సాయి, గ్రామ నాయకులు రాచకొండ సైదులు, మడ్డి శ్రీను, అయోధ్య చందాల, నాగార్జున, శ్రీరాములమ్మ, పూలమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భీమిరెడ్డి త్యాగాలు నేటి యువతకు ఆదర్శం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News