Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

26-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం శ్రీరామాలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి విడతల వారీగా రూ.560 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

గత పది సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని చెప్పారు.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

Article Image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం శ్రీరామాలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి విడతల వారీగా రూ.560 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

గత పది సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని చెప్పారు.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News