Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

భద్రాచలం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళ సమావేశం

భద్రాచలం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళ సమావేశం

భద్రాచలం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళ సమావేశం
January 06, 2026 06:12 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పార్టీకి పట్టుకొమ్మల్లా పనిచేయాలి.

కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్,తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ నిర్మాణం కోసం స్టేట్ వైస్ ప్రెసిడెంట్,అజ్వర్వర్,అశ్వర్ షరీఫ్ తో కలిసి కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఎంపీ.రామసాయం రఘురాం రెడ్డి,జిల్లా డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న,సీనియర్ పీసీసీ జనరల్ సెక్రటరీలు దుర్గాప్రసాద్,ధర్మారావు, సీతారాం యాదవ్,ఆదివాసి స్టేట్ కమిటీ నెంబర్ అర్జున్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్.ఎస్.యుఐ నాయకులు,మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ...వ్యక్తుల కంటే పార్టీ మిన్న పార్టీ నిర్మాణం జరుగుతూనే ప్రభుత్వం బలంగా ఉంటుంది కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలకు సరైన పదవులు ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ...కార్పొరేషన్,మున్సిపాలిటీ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,నేతృత్వంలో జిల్లా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సారథ్యంలోఎంపి.రఘురాం రెడ్డి,సారథ్యంలో ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం డివిజన్ వైస్ గా మీటింగులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ ఒక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆరుల మురళి,జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దేవి ప్రసన్న,రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ..ఈ సమావేశానికి కాకుండా జిల్లాకు జిల్లా కమిటీ మండల కమిటీ అబ్జర్వేషన్ కి రావడం జరిగింది జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి దేవి ప్రసన్న,ఎంపీ రఘురాం రెడ్డిని,ఎమ్మెల్యేను,సంప్రదించి జిల్లా కమిటీని త్వరలోనే ఈనెల ఎనిమిది తారీకు నియమించాలన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కొత్తగూడెం భద్రాచలం జిల్లాకు విచ్చేయడం జరిగింది.కాబట్టి కచ్చితంగా జిల్లా కమిటీ కార్యవర్గాన్ని పెద్దలందరి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదంతో పిసిసి ఆదేశాల మేరకు గతంలో పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులకు 70 శాతం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కూడా 20 నుండి 30 శాతం సేకరిస్తూ...జిల్లా కార్యవర్గాన్ని చేయాలని పిసిసి ఆదేశాలు ఇచ్చారు,జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ దేవి ప్రసన్న కలిసి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.అదేవిధంగా కార్పొరేషన్ 56 డివిజన్ కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని నిర్వహిస్తే వారిని గెలిపించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,అదేవిధంగా రాహుల్ గాంధీ,దేశంలో కేంద్ర ప్రభుత్వం పైన గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి సర్వనాశనం చేశారు.ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి సహచర మంత్రులు ఎన్నో కష్టాలు పడే మన సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. పేదవారు సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పథకం ప్రతి పేదోడు ఇందిరమ్మ ఇంట్లో ఉండాలని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఇస్తున్నారు,500కే గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి ధర 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,మహిళలను కోటీశ్వరులు చేయాలన్న మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కొత్తగూడెం భద్రాచలం జిల్లా కార్పోరేషన్ లో కూడా అదేవిధంగా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి మీరు అండదండలుగా ఉండాలని రానున్న తరుణంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాచమల్ల రమేష్,భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేట్ కృష్ణారెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నాకోటి రాము,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News