Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

భైరవునిపల్లిలో విషాద కుటుంబానికి అండగా మల్లి బాబు యాదవ్

29-12-2025 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భైరవునిపల్లిలో దశదినకర్మలకు హాజరై కుటుంబాన్ని పరామర్శించిన మల్లి బాబు యాదవ్

నేలకొండపల్లి: స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు

నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామానికి చెందిన కనక బండి నారాయణ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమాలకు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ హాజరై కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తో కలిసి నారాయణ యాదవ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, 1992–93లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన గొర్రెల సంఘాల ఉద్యమంలో భాగంగా భైరవునిపల్లిలో మురళీకృష్ణ గొర్రెల పెంపకదారుల సంఘం ఏర్పాటుకు కనక బండి నారాయణ చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేశారు. పెద్దల సహకారం వల్లనే తాను అప్పట్లో జిల్లా అంతటా తిరిగి సంఘాల అభివృద్ధికి పాటుపడగలిగినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కనక బండి వెంకటేశ్వర్లు, కనక బండి రమేష్, రెడ్డి బోయిన సత్యనారాయణ, మల్లె బోయిన ఉపేందర్, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, బుర్ర కృష్ణ, మల్లె బోయిన శ్రీనివాస్, మన్నె కృష్ణ, తెలగొర్ల లింగస్వామి, రాసాల కనకయ్య, కనక బండి కనకరాజు, చంద్రకాని మధు, నూక చిన్న నాగయ్య, మల్లె బోయిన గోవిందరావు తదితర యాదవ బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

Sthanikam

భైరవునిపల్లిలో విషాద కుటుంబానికి అండగా మల్లి బాబు యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News