Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:03 AM

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

29-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల పరిధిలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసలై అప్పులపాలవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్నేహితులు లేదా బంధువుల వద్ద తరచూ డబ్బులు అప్పుగా అడుగుతున్నట్లయితే కారణాలు తెలుసుకోవాలని సూచించారు. సమస్య తీవ్రంగా మారే వరకు చాలా కుటుంబాలకు విషయం తెలియకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు లేదా ఆడిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజం మొత్తం కలిసి ఈ అక్రమ బెట్టింగ్ వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు.

Sthanikam

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News