Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:02 AM

బీసీలకు బడ్జెట్‌లో భారీ అన్యాయం – వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం

23-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ నిరసన ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యులు వట్టె జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీసీలు రాష్ట్రంలో అధిక శాతం ఉన్నప్పటికీ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీసీల ఓట్ల కోసం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పటికీ ముందుంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ ర్యాలీలో పార్టీ నాయకులు మామిడి అంజయ్య, మీర్ అక్బర్, కొన్నె మంజుల గౌడ్, నారాయణదాసు కవిత, కుంభం నాగరాజు, సోమగాని లింగస్వామి, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మురళి, కోల కరుణాకర్, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలుస్తుందని వట్టె జానయ్య యాదవ్ పేర్కొన్నారు.

Sthanikam

బీసీలకు బడ్జెట్‌లో భారీ అన్యాయం – వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News