Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

27-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారానికి ఐదు పని దినాలు మాత్రమే కల్పించాలని ఎస్‌బీఐ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలో ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది సంవత్సరాల క్రితమే బ్యాంకు మేనేజ్‌మెంట్ ఈ అంశాన్ని అంగీకరించినప్పటికీ, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలకే సెలవులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్ల అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్. భాస్కర్, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి నరేష్, కెనరా బ్యాంక్ కార్యదర్శి సట్టు రామకృష్ణతో పాటు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

Article Image

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారానికి ఐదు పని దినాలు మాత్రమే కల్పించాలని ఎస్‌బీఐ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలో ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది సంవత్సరాల క్రితమే బ్యాంకు మేనేజ్‌మెంట్ ఈ అంశాన్ని అంగీకరించినప్పటికీ, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలకే సెలవులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్ల అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్. భాస్కర్, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి నరేష్, కెనరా బ్యాంక్ కార్యదర్శి సట్టు రామకృష్ణతో పాటు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News