Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

13-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మొరిశెట్టి నివేదిత లక్షాది, హనుమంతరెడ్డి, మీలా మహదేవ్.

సూర్యాపేట జిల్లా, : వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ గ్రూప్ సంస్థ సహకారం అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట, 48వ వార్డు కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపాలిటీ, సుధాకర్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, సంస్థ ప్రతినిధి మీలా మహదేవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడదెబ్బ, నీరసం వంటి సమస్యలు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొనతం రాజేష్, వెలుగు వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News