Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ

25-03-2026 285 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ స్పందించింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని బీఎస్పీ నేతలు విమర్శించారు.

నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ, పనులు ఇంకా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రత్యేకంగా రామన్నపేట, చిట్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్ట్ పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పై నిర్మించాల్సిన బ్రిడ్జ్ పనులను తక్షణమే ప్రారంభించి, ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టమైన సమయపట్టిక ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు నిజంగా సాగునీరు అందే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Sthanikam

బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ

Article Image

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ స్పందించింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని బీఎస్పీ నేతలు విమర్శించారు.

నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ, పనులు ఇంకా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రత్యేకంగా రామన్నపేట, చిట్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్ట్ పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పై నిర్మించాల్సిన బ్రిడ్జ్ పనులను తక్షణమే ప్రారంభించి, ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టమైన సమయపట్టిక ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు నిజంగా సాగునీరు అందే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News