Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్

24-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన పునరావాసం, పునర్వ్యవస్థీకరణ (ఆర్‌అండ్‌ఆర్) ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బి.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లేఅవుట్లలో కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాలనీల్లో నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన కల్పించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News