Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి

01-05-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధుల్లో భాగంగా బస్సు తనిఖీ చేస్తున్న ఆర్టీసీ టికెట్ తనిఖీ అధికారులపై బస్సు కండక్టర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఝరాసంగం మండలం కప్పాడు వద్ద నారాయణఖేడ్ డిపోకు చెందిన టీజీ15జెడ్0082 బస్సును టిటిఐ ఏసయ్య, టిటిఐ ప్రకాశ్, డ్రైవర్ ప్రతాప్ కలిసి తనిఖీ చేయగా ఒక ప్రయాణికునికి మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జారీ చేసే జీరో ఎంహెచ్‌సీ టికెట్ ఇచ్చి రూ.20 వసూలు చేసినట్లు గుర్తించారు. దీనిపై కండక్టర్ వసంత్‌కు చార్జి మెమో జారీ చేయగా అతడు సంతకం చేయకుండా ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికులను రెచ్చగొట్టి టిటిలపై చెప్పులతో దాడి చేయడంతో పాటు చార్జి మెమో బుక్ మరియు సంబంధిత టికెట్‌ను చించివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో టిటిఐ ఏసయ్యకు ఎడమ చేతి బొటనవేలికి, టిటిఐ ప్రకాశ్‌కు నుదిటిపై గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కండక్టర్ వసంత్‌తో పాటు సంబంధిత ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడే పోలీసులు తెలిపారు.

Sthanikam

బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News