Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

25-03-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గం పరిధిలోని బసాపురం గ్రామంలో “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయగా, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బిటి నాయుడు హాజరయ్యారు. అలాగే ఉమాపతి నాయుడు కూడా పాల్గొని 6వ విడత “అన్నదాత సుఖీభవ” ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సహాయ నిధుల వివరాలను తెలియజేశారు.

అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, సబ్సిడీపై అందుతున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు, ఆధునిక సాంకేతికతతో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్ఎంసి వాటర్ చైర్మన్ రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, నీలకంఠప్ప, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సత్తన్న, రంగన్న, అయ్యన్న, వీరారెడ్డి, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News