Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరూ కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనకాడం

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరూ కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనకాడం

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరూ కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనకాడం
March 26, 2026 08:38 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతుల వ్యవసాయ పొలాల మధ్యన నుంచి బస్వాపురం ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళ్ళడానికి తవ్విన కాలువను రైతులు,వృత్తిదారులు,గ్రామీణ వ్యవసాయ కూలీలు దాటడానికి,రాకపోకలు కొనసాగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో ఉన్న పైపులను తొలగించాలన్న ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి,అధికారులు వెంటనే విరమించుకోవాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేసినారు.బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరితో కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనుకాడబోమని వారు హెచ్చరించినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని,కాలువలో ఉన్న పైపులను అక్రమంగా తొలగించవద్దని గ్రామ సర్పంచ్,మాజీ సర్పంచ్,ఇతర ప్రజాప్రతినిధులు,రైతులు,వ్యవసాయ కూలీలు,వృత్తిదారులతో కలిసి కాల్వ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కాల్వ దగ్గర ఆందోళన చేసి ఇప్పుడేమో ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి అవసరం లేదు పైపులను తొలగించాలని అనడం ఎట్లా కరెక్ట్ అని అన్నారు.అధికారం కోసం ఒక మాట,అధికారం చేపట్టినంక మరొక మాట మాట్లాడకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని 50 శాతం మంది వ్యవసాయ కూలీలకు,రైతులకు,వృత్తిదారులకు ఉపయోగపడుతున్న గుట్టలు,వ్యవసాయ భూములు,వృత్తిదారుల చేపల కుంటలు కూడా కాలువ అవతలి భాగంలో ఉన్నాయని తెలిపారు.సర్వే నెంబరు 259 లోని ప్రభుత్వ భూమిని గత 60,70 సంవత్సరాల క్రితం వందమందికి పైగా పేదలకు ఇచ్చారని మరి ఆ భూముల దగ్గరికి కాలువ దాటి ఎలా వెళ్తారని అధికారులను ప్రశ్నించారు.గొర్ల,మేకల పెంపకము దారులు,పాడి రైతులు తమ గోర్లను,మేకలను,బర్లను,ఆవులను రోజు మేత మేపడానికి కాలువ దాటి వెళ్తారని మరి వాళ్లు కూడా ఎక్కడనుండి వెళ్లాలని అడిగారు.గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కాల్వపై బ్రిడ్జిని నిర్మాణం చేపడతామని కాలమెల్లదీససారని,ఈ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల నుండి ఇదిగో అదిగో బ్రిడ్జి అని చెప్పి ఇప్పుడేమో మాట తప్పుతున్నారని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణం చేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసే పనులను చేపడితే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదని అవసరమైతే గ్రామ ప్రజలందరం కలిసి కాలువనే పూడుస్తామని నర్సింహ హెచ్చరించారు.గ్రామ సర్పంచ్,మాజీ సర్పంచ్ రాంపల్లి కృష్ణ,మాకోల్ల సత్యం మాట్లాడుతూ ఇప్పటికే చాలామంది రైతులు కాలువ కోసము తమ భూములను కోల్పోయినారని అన్నారు. ఉన్న భూముల దగ్గరికి కూడా పోకుండా దారి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ,జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకొని కాల్వపైన బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని, బ్రిడ్జి నిర్మాణం తర్వాతనే కాలువలో ఉన్న పైపులను తొలగించాలని వారు కోరినారు.లేకపోతే ఆందోళన,పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించినారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ,గ్రామ ఉప సర్పంచ్ అందె మల్లేశం,వార్డు మెంబర్లు జక్కుల మల్లేశం,కొండమడుగు అశోక్,గజ్జి కవితా కుమార్,సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండా అశోక్,సిపిఎం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ కాంగ్రెస్,టిఆర్ఎస్ నాయకులు,రైతులు,వ్యవసాయ కార్మికులు గోదాల వెంకటరెడ్డి,శెట్టి ఐలయ్య,కొండ పాండు,ఎంకర్ల పాండు,వీరేశం,రాజు,నరేష్,కొండమడుగు పోశయ్య,జహంగీర్,ఎడ్ల కిష్టయ్య,ఏశమైన నరసమ్మ,కూకుట్ల మల్లమ్మ,ఎడ్ల సరూప,కర్రే లక్ష్మి,కొండ మహేశ్వరి,నవ్య,రాగుల లక్ష్మి,పసుల కావ్య,ఏశమైన మంజుల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News