Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:01 PM

బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం మన్సూరాబాద్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన

26-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన్సూరాబాద్, బాలికల భవిష్యత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అమిత ఆధ్వర్యంలో సహారా సర్కిల్ సమీపంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ కేన్సర్‌కు ప్రధాన కారణమైన హెచ్‌పీవీ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 14–15 ఏళ్ల వయస్సులోనే వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వబడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

వైద్య సిబ్బంది వ్యాక్సిన్ మోతాదులు, ప్రయోజనాలు, స్వల్ప దుష్ప్రభావాలపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు.

Sthanikam

బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం మన్సూరాబాద్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన

Article Image

మన్సూరాబాద్, బాలికల భవిష్యత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అమిత ఆధ్వర్యంలో సహారా సర్కిల్ సమీపంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ కేన్సర్‌కు ప్రధాన కారణమైన హెచ్‌పీవీ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 14–15 ఏళ్ల వయస్సులోనే వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వబడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

వైద్య సిబ్బంది వ్యాక్సిన్ మోతాదులు, ప్రయోజనాలు, స్వల్ప దుష్ప్రభావాలపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News