Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్

21-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం, ఉచిత విద్య, ఇతర సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, పోషకాహారం కూడా భాగమని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు దానం కాదు, ప్రజలకు కల్పించిన హక్కులేనని స్పష్టం చేశారు.

దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు బాధపడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల సంక్షేమంపై మాట్లాడే ముందు, ఆ రంగంలో ఉన్న లోపాలు, అవినీతి అంశాలపై చర్చించడం అవసరమని సూచించారు.

Sthanikam

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News