Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

29-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ, గుమ్మడిదలలోని అనోర ఫార్మా కంపెనీలో బాలల భద్రత, చైల్డ్ సేఫ్టీ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటించాలని, ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, పోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తూ బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఇటువంటి ఘటనల సమాచారాన్ని తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందుకు వస్తేనే న్యాయం జరిగి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సదాశివపేట సీఐ వెంకటేశ్, ఎంఆర్ఎఫ్ అడ్మిన్ పటేల్, అనోర ఫార్మా హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, కంపెనీ యాజమాన్యం, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News