Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ

01-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా, ఆందోల్ నర్సింగ్ కాలేజ్, జోగిపేట బస్ స్టాండ్ ప్రాంతాల్లో చైల్డ్ సేఫ్టీ, బాలల రక్షణ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటిస్తూ ఆడ, మగ తేడా లేకుండా సమానంగా చూడాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరించారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ బాలలపై లైంగిక వేధింపుల కేసులను తీవ్రంగా పరిగణించి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని, ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098తో పాటు జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773ను సేవ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ యాదమ్మ, కార్మిక సంఘాల నాయకులు, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News