Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:01 AM

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు

30-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దత్తత సహాయ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డాక్టర్ చక్రపాణి, బాలల సంక్షేమ సంఘం సభ్యుడు వెంకటేశం ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మహిళా ప్రాంగణంలో నిర్వహించిన దత్తత మరియు సంరక్షణ కుటుంబాలపై అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ చట్టబద్ధ దత్తత ద్వారా పిల్లలకు కుటుంబ వాతావరణం, మంచి భవిష్యత్తు లభిస్తుందని, తల్లిదండ్రులకు కూడా పిల్లలతో కుటుంబ బంధాలు ఏర్పడతాయని వివరించారు. దత్తతకు ఇచ్చే ప్రతి శిశువుకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే దత్తత ప్రక్రియ చేపడతామని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రత్యేక విభాగంలో దత్తతకు అందజేస్తామని తెలిపారు. అలాగే తాత్కాలిక దత్తత, సంరక్షణ కుటుంబాల విధానం, దత్తతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, మిషన్ వాత్సల్య పోర్టల్ వినియోగం, శిశు గృహాల్లో పిల్లలకు అందిస్తున్న సంరక్షణ సేవల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు, బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది, బాలల సహాయవాణి ప్రతినిధులు, సఖి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News