Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:14 PM

బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్

27-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: బక్రీద్ పండుగను ప్రజలందరూ పరస్పర సహకారం, సోదరభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కోరారు. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రేపు జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, సోషల్ మీడియాలో వదంతుల నియంత్రణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించేందుకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్‌ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 9121101003 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

గోవుల అక్రమ రవాణా నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై సైబర్ వింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఆదోని ఇన్‌చార్జ్ డీఎస్పీ భార్గవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్‌రావు, ఆదోని పట్టణ సీఐలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News