Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

27-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని వివిధ గ్రామాలకు చెందిన మైనారిటీ సోదరీమణులకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా దానధర్మాలు, మానవత్వం, సహాయ సహకారాలకు ప్రతీక అని అన్నారు. మతం ఏదైనా ప్రతి మనిషిలో దయ, కరుణ, పంచుకునే గుణం ఉండాలని అన్ని మతాలు బోధిస్తాయని తెలిపారు. మన దగ్గర ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాయని, పండుగ సమయంలో వారికి సహాయం చేయడం ద్వారా వారి ఇంట్లో కూడా ఆనందం నింపగలమన్నారు. ఆకలి అనేది అందరికీ సమానమని, శక్తికొద్దీ పేదలకు దానధర్మాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని వివిధ గ్రామాలకు చెందిన మైనారిటీ సోదరీమణులకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా దానధర్మాలు, మానవత్వం, సహాయ సహకారాలకు ప్రతీక అని అన్నారు. మతం ఏదైనా ప్రతి మనిషిలో దయ, కరుణ, పంచుకునే గుణం ఉండాలని అన్ని మతాలు బోధిస్తాయని తెలిపారు. మన దగ్గర ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాయని, పండుగ సమయంలో వారికి సహాయం చేయడం ద్వారా వారి ఇంట్లో కూడా ఆనందం నింపగలమన్నారు. ఆకలి అనేది అందరికీ సమానమని, శక్తికొద్దీ పేదలకు దానధర్మాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News