Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

21-03-2026 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని పల్లివాడకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బైకాని నరసింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన సీపీఎం మండల నాయకత్వంతో కలిసి నరసింహ మృతదేహానికి పూలమాలలు అర్పించి జోహార్లు ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరసింహ నిబద్ధత గల కమ్యూనిస్టు కార్యకర్తగా గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడారని గుర్తు చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం, హమాలి యూనియన్‌లో కీలక పాత్ర పోషిస్తూ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిజాయితీగా పనిచేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.

నరసింహ అకాల మరణం గ్రామంతో పాటు మండల స్థాయి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి నాగేష్, నాయకులు కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, ముక్కముల మల్లేష్, శాఖా కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, పులిబిక్షం, మునికుంట్ల లెనిన్, గోగు లింగస్వామి, జనపాల లక్ష్మణ్, వార్డు సభ్యులు గట్టు ఉపేందర్, దండిగ నరసింహ, తొలుపునూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News