Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:27 AM

బైక్‌, మేకల దొంగల అరెస్ట్‌ 7 బైకులు, కారు స్వాధీనం.. అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత.

బైక్‌, మేకల దొంగల అరెస్ట్‌ 7 బైకులు, కారు స్వాధీనం.. అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత.

బైక్‌, మేకల దొంగల అరెస్ట్‌  7 బైకులు, కారు స్వాధీనం.. అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత.
May 27, 2026 09:09 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి: బైకులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగతో పాటు ఓ మైనర్ బాలుడిని నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, 7 మోటార్‌సైకిళ్లు, దొంగతనాలకు వినియోగించిన బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైక్‌, పశువుల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని హీరో ప్యాషన్ ప్రో బైక్‌పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.

పట్టుబడిన గువ్వల శబరీష్‌పై నల్లగొండ జిల్లాలో 18 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 3 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలుడితో కలిసి గ్రామాల్లో రేకీ నిర్వహించి రాత్రివేళల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి గుంటూరు జిల్లా నల్లపాడు సంతలో విక్రయించేవాడని వెల్లడించారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను తాళాలు విరగ్గొట్టి ఫేక్ నంబర్‌ప్లేట్లు అమర్చి విక్రయించేవారని తెలిపారు.

నార్కట్‌పల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ రూరల్, అచ్చంపేట, నెల్లూరు ప్రాంతాల్లో జరిగిన పలు దొంగతనాల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

కేసును ఛేదించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News