Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్

13-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బహుజనుల హక్కుల సాధన దిశగా కీలక పాత్ర పోషించిన మహనీయుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నిర్వహించిన మండల్ పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు పలు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో మండల్ కృషి మరువలేనిదని కొనియాడారు. మండల్ కమిషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు లభించిన ప్రయోజనాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలమని, అందరూ సంఘటితంగా కృషి చేసినప్పుడే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురికి మండల్ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజా నాయకులు, బహుజన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News