Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:03 AM

బహుజన ఐక్యతతోనే నిజమైన రాజ్యాధికారం సాధ్యం

18-01-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీసీ సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన సభలో వట్టె జానయ్య యాదవ్ స్పష్టం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జనగామ జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఘనంగా ఆత్మీయ అభినందన సన్మాన సభ నిర్వహించారు. బీసీ జేఏసీ చైర్మన్ సేవేలి సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచ్‌లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బీసీల్లో చైతన్యం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ప్రశంసించారు. బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీ వర్గాల ఐక్యతతోనే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి అగ్రకులాల అభ్యర్థులు వెనకడుగు వేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థుల్లో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉండటం బహుజన సమాజంలో వచ్చిన రాజకీయ చైతన్యానికి నిదర్శనమని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బహుజన వర్గాలదే పైచేయి ఉంటుందని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వంలో ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సన్మాన సభ బీసీ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, బహుజన ఐక్యతతో తెలంగాణలో రాజ్యాధికార సాధన దిశగా ఇది కీలక అడుగుగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు డా. కల్నల్ మాచర్ల భిక్షపతి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు ఓదేల్ యాదవ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, బీసీ నాయకులు సదానంద్, మౌనిక యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బహుజన ఐక్యతతోనే నిజమైన రాజ్యాధికారం సాధ్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News