Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:04 AM

బీసీ సబ్ ప్లాన్ లేకుండా అభివృద్ధి శూన్యం తహశీల్దార్‌కు వినతి పత్రం

07-01-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పెన్పహాడ్ తహశీల్దార్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వినతి పత్రం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ వట్టె జానయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధి పేరుతో కేటాయించిన నిధులు ఇతర అవసరాలకు మళ్లిపోకుండా ఉండాలంటే బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుతోనే బీసీల విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పెన్పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నరహరి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యగ్గడి మురళి, జిల్లా నాయకులు మామిడి శోభన్ బాబు, యాదగిరి రంగయ్య, మధు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, బీసీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నాయకులు తేల్చిచెప్పారు.

Sthanikam

బీసీ సబ్ ప్లాన్ లేకుండా అభివృద్ధి శూన్యం తహశీల్దార్‌కు వినతి పత్రం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News