Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:00 AM

బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయాలి

బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయాలి

బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయాలి
07-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మకూర్ ఎంఆర్‌ఓకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెమోరాండం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆత్మకూర్ మండల ఎంఆర్‌ఓను కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ వారికి తగిన నిధులు, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మకూర్ మండల అధ్యక్షులు బొల్లె సైదులు, ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్య యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షులు కోల కర్ణాకర్ ముదిరాజ్, పార్టీ నాయకులు వీరబోయిన గంగయ్య యాదవ్, కందగట్ల ఏడవ, 7వ నెంబర్ వార్డు బోనగిరి మహేష్, కుషనపల్లి వెంకన్న, అల్లి శ్రీకాంత్, సంతోష్, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధంగా అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News