Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:08 AM

బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

06-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం బొర్గి తండాకు చెందిన సావిత్రిబాయి, నికిత, నందిని ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటనపై నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన బాధిత కుటుంబాల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి విషాదకర ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని, ఒకేసారి కుటుంబంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు నిరుపేద కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా బహిరంగ బావులు, ప్రమాదకర ప్రదేశాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. అనంతరం మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజ్ పటేల్, బసవరాజ్ పటేల్, హుల్బరావు, అబ్రం, ప్రకాష్ రెడ్డి, సురేష్ రావు, మనోజ్, భూమప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News