Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

బడ్జెట్‌పై సిపిఐ ఎమ్మెల్సీ అసంతృప్తి ప్రజల ఆశలకు దూరమైన బడ్జెట్: నెల్లికంటి సత్యం

20-03-2026 503 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్‌పై సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ‘మిశ్రమ బడ్జెట్’గానే మిగిలిందని, సామాన్య ప్రజలు ఆశించిన ప్రయోజనాలు ఇందులో కనిపించడం లేదని విమర్శించారు.

ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను రెట్టింపు చేస్తారని వృద్ధులు, పేదలు ఆశించినప్పటికీ, బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గీత కార్మికులు, యాదవులు, ముదిరాజులు, చేనేత కార్మికులు వంటి వృత్తి వర్గాల సంక్షేమానికి కనీస ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు.

విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం కేవలం 8 శాతంతో సరిపెట్టిందని, ఆరోగ్య రంగానికి 4 శాతం మాత్రమే కేటాయించడం ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం ఆందోళనకరమన్నారు.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ బీమా’ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వడాన్ని స్వాగతించినప్పటికీ, కేటాయించిన నిధులు పారదర్శకంగా ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

బడ్జెట్‌పై సిపిఐ ఎమ్మెల్సీ అసంతృప్తి ప్రజల ఆశలకు దూరమైన బడ్జెట్: నెల్లికంటి సత్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News