Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:54 AM

బడ్జెట్‌లో జర్నలిస్టులకు మొండి చెయ్యి

బడ్జెట్‌లో జర్నలిస్టులకు మొండి చెయ్యి

బడ్జెట్‌లో జర్నలిస్టులకు మొండి చెయ్యి
20-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుల పట్ల వివక్ష తగదు: మామిడి సోమయ్య

హైదరాబాద్,

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా మొండి చెయ్యి చూపిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం జర్నలిస్టులను విస్మరించిందని, సమాచార పౌర సంబంధాల శాఖను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. చిన్న, మధ్యతర పత్రికలకు ఇవ్వాల్సిన ప్రకటన బిల్లులు కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. మీడియా అకాడమీ గురించి కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ఇతర పథకాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, నిధులు లేకుండా ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తరువాత జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, కొత్త గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం పెంచాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని గత రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఈ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మీడియాపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం సహించరానిదని అన్నారు. వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

బడ్జెట్‌లో జర్నలిస్టులకు మొండి చెయ్యి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News