Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

బచ్చోడులో భక్తి వెల్లువ… శివ–కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

25-03-2026 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలాయపాలెం,

మండల పరిధిలోని బచ్చోడు గ్రామం ఆధ్యాత్మిక చైతన్యంతో కళకళలాడింది. మూడు రోజులుగా శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లతో పాటు శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.

వేద పండితుల ఆధ్వర్యంలో జలధివాసం, ధాన్యధివాసం వంటి క్రతువులు నిర్వహించిన అనంతరం, బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణలు మారుమోగాయి. ఉదయం వాస్తు పూజ, పంచలోహ నవరత్న స్థాపన కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 9:50 గంటల సుముహూర్తాన విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఘట్టాలను ఘనంగా నిర్వహించారు.

మంగళవాయిద్యాల నడుమ స్వామివార్లకు ప్రాణ ప్రతిష్ఠ చేయగా భక్తుల జయజయధ్వానాలతో గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రామసహాయం నరేష్ రెడ్డి, రామసహాయం అరవింద్ రెడ్డి, హరిత రెడ్డి, బెల్లం శ్రీను, గండ్ర గోపాలరావు, కొప్పుల అశోక్, మంగీలాల్, ఉన్నం రాజశేఖర్, ఎన్. లింగయ్య, బి. సుదర్శన్, కరీం, వనవాసం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బచ్చోడులో భక్తి వెల్లువ… శివ–కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News