Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
14-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి పిలుపు

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కల్లూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News