Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా

14-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సర్వోత్తమ్ రెడ్డి, నివేదిత లక్షాది చేతుల మీదుగా ప్రారంభం

సూర్యాపేట: పట్టణంలోని 9వ వార్డు బలహీన వర్గాల కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలో అస్పృశ్యతను నిర్మూలించి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News