సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మకర జ్యోతి దర్శనం ఘనంగా నిర్వహించారు. శబరిమలై వెళ్లలేని భక్తుల కోసం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు సతీష్ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పడిపూజ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బెల్దే శ్రీనివాస్, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, గురుస్వాములు జెపిటి, సంపత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాచకొండ దేవయ్య, సతీష్, కోటి శర్మ, రంగు ముత్యం రాజు, రాజు, లక్ష్మయ్య, వీరారెడ్డి, వెంకటరమణతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి