రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, అక్రమాలకు ఊతమిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని 39, 41 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం వేల కోట్ల రూపాయల నిధులతో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ప్రతి ఓటరు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభ్యర్థి దంతాల సాయిప్రియ సందీప్, 41వ వార్డు అభ్యర్థి ఢిల్లీ పావని ఉపేందర్, నాయకులు ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, వెంపటి సురేష్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this Article1 Shares
గురువారం
Feb
05
2026
ప్రాంతీయ వార్తలు | సూర్యాపేట
Biksham
అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, అక్రమాలకు ఊతమిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని 39, 41 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం వేల కోట్ల రూపాయల నిధులతో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ప్రతి ఓటరు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభ్యర్థి దంతాల సాయిప్రియ సందీప్, 41వ వార్డు అభ్యర్థి ఢిల్లీ పావని ఉపేందర్, నాయకులు ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, వెంపటి సురేష్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి