Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా అరెస్ట్.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం

04-05-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకుని పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు లక్షల రూపాయల నగదు, ఒక తుపాకి రెండు బుల్లెట్లతో, ఒక గాలి తుపాకి, రెండు కత్తులు, ఆరు చేతి దూరవాణులు, ఒక టిప్పర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్ వెల్లడించారు. నారాయణఖేడ్ పట్టణంలోని మనూర్ కూడలి వద్ద జరిగిన వాహన దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు నిఘా పెట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పట్టుకుని విచారించగా, వారు అంతర్రాష్ట్ర స్థాయిలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారని తేలింది. విచారణలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వాహన దొంగతనాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఒక రాష్ట్రంలో వాహనాలను దొంగిలించి మరో రాష్ట్రంలో విక్రయిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నేరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఇప్పటివరకు మొత్తం పదకొండు కేసుల్లో తమ ప్రమేయం ఉన్నట్లు నిందితులు అంగీకరించారని, అరెస్టు చేసిన వారిని న్యాయస్థాన ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ఈ కేసును ఛేదించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, నారాయణఖేడ్ పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి అభినందించారు.

Sthanikam

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా అరెస్ట్.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News