Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

07-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అంతరాష్ట్ర సరిహద్దులో క్షుణ్ణంగా పోలీస్ తనిఖీలు

రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య వారధిగా ఉన్న జాతీయ రహదారి 65 పై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం వద్ద ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. వరి ధాన్యం, ప్రభుత్వ పంపిణీ బియ్యం, పశువుల రవాణా, మద్యం, ఇసుక, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నిర్మూలించడంలో భాగంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ ద్వారమైన సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చెక్ పోస్ట్ నందు పోలీసు సిబ్బంది రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడంలో పటిష్టంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సామాన్య ప్రజానీకానికి సామాన్య ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఈ సరిహద్దు చెక్ పోస్ట్ నందు పటిష్టమైన నిఘా ఉంచామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని తెలంగాణకు వచ్చి అమ్మకుండా గా ఉంచామని ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని.ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనంతగిరి ఎస్సై నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News