Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీజేపీ నేతల అరెస్టులు

23-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో రామన్నపేట మండలంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు నిర్వహించనున్న కార్యక్రమాన్ని అడ్డుకునే భాగంగా రామన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్యలను పోలీసులు సోమవారం ఉదయం వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. తమ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు ఆర్థిక మద్దతు, వృద్ధాప్య పింఛన్లు పెంపు వంటి పలు హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని అన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అరెస్టైన వారిలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు పల్లపు దుర్గయ్య, రాజన్న, రమేష్, కొడారి వెంకన్న, సూరి మల్లేష్ తదితరులు ఉన్నారు.

Sthanikam

అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీజేపీ నేతల అరెస్టులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News