Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:40 AM

ఆస్తి రాసిచ్చిన తండ్రిని వేధించిన కొడుకులు… చిన్నకోడూరు పోలీసుల కేసు నమోదు

15-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న కన్నతండ్రిని వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. నారాయణరెడ్డి తనకు ఉన్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సమానంగా చెరి 3½ ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వయస్సు పైబడటంతో తమను చూసుకుంటారని ఆశించి ఆస్తిని కుమారులకు అప్పగించినప్పటికీ, వారు మాట మార్చినట్లు బాధితుడు వాపోయారు.

ఆస్తి రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఒక పాత ఇంట్లో ఉంచి కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నారాయణరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బూతులు తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు.

విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. వృద్ధుడు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉండటంతో అధికారులే నేరుగా ఆయన నివాసానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ, బాధ్యులైన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శ్రీను తెలిపారు.

అలాగే వృద్ధులపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.

Sthanikam

ఆస్తి రాసిచ్చిన తండ్రిని వేధించిన కొడుకులు… చిన్నకోడూరు పోలీసుల కేసు నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News