Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

ఆరోపణల్లో వాస్తవం లేదు: యాదగిరిగుట్ట ప్రధాన అర్చకుడు వెంకటాచార్యులు

24-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు తనపై వచ్చిన జాతా శౌచం (పురుడు మైల) ఆరోపణలను ఖండించారు. తాను పూర్తిగా శాస్త్రం, ధర్మం ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నానని స్పష్టం చేశారు.

ఇటీవల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో తనపై వచ్చిన విమర్శల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. పురుడు జరిగిన కుటుంబంతో తమకు నాలుగు తరాల దూరం ఉండటంతో జాతా శౌచం వర్తించదని వివరించారు. అదేవిధంగా ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవని, సమాచారం కూడా అందలేదని చెప్పారు.

దైవ కార్యక్రమాల సమయంలో దీక్ష దారణ చేసిన తర్వాత అశౌచాలు వర్తించవని శాస్త్రం స్పష్టంగా చెబుతోందని వెంకటాచార్యులు పేర్కొన్నారు. ఆలయంలో క్రమశిక్షణ పాటించేలా సూచనలు చేయడం వల్ల కొందరు కక్ష సాధింపుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

43 సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిష్ఠగా కొనసాగుతున్నానని, శాస్త్ర విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసే వారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.

Sthanikam

ఆరోపణల్లో వాస్తవం లేదు: యాదగిరిగుట్ట ప్రధాన అర్చకుడు వెంకటాచార్యులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News