Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెదపాడు పోలీసుల అండ – మానవీయత చాటిన ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్

15-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెదపాడు పోలీసుల మానవీయత మరోసారి వెలుగుచూసింది. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక బాధ్యతలోనూ తాము ముందుంటామని పెదపాడు పోలీసులు నిరూపించారు. ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబాన్ని ఆదుకుని తమ ఉదారతను చాటుకున్నారు. పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు (36) గత కొంతకాలంగా పచ్చకామెర్లు వ్యాధితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన మృతి చెందారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడమే కాకుండా తీవ్ర పేదరికంలో ఉన్న ఆ కుటుంబం కనీసం అంత్యక్రియల తర్వాతి కార్యక్రమాలను నిర్వహించుకోలేని దయనీయ పరిస్థితిలో పడింది.

ఈ విషయాన్ని గమనించిన గ్రామ పెద్దలు పెదపాడు ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్సై మానవీయ కోణంలో స్పందించారు. మృతుని దశదిన కార్యక్రమం నిర్వహించుకునేందుకు పెదపాడు పోలీస్ స్టేషన్ తరపున 75 కిలోల బరువున్న మూడు బియ్యం బస్తాలను ఆ కుటుంబానికి అందజేశారు. పోలీసు అధికారి హోదాలో ఉన్నప్పటికీ తమ కష్టాన్ని గుర్తించి సొంత మనిషిలా ఆదుకున్న ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్‌కు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఖాకీ డ్రస్సులో ఉన్న మానవత్వాన్ని చూసి గ్రామస్తులు ఎస్ ఐ శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెదపాడు పోలీసుల అండ – మానవీయత చాటిన ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News