Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

అనాథ, వృద్ధాశ్రమాలకు శ్రీ చైతన్య విద్యార్థుల సేవా చేయూత

24-03-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం పట్టణంలోని అనాథ మరియు వృద్ధాశ్రమాలను సందర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 25, 26 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి టెక్నికల్ & కల్చరల్ ఫెస్ట్ “శ్రీ చైతన్య ఉత్సవ్-26”లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

బ్యాంక్ కాలనీలోని ఈశ్వరమ్మ ప్రశాంతి సదన్, ఎన్ఎస్పి క్యాంప్‌లోని జీవన్ సంధ్య ఆశ్రమం, నాయుడుపేట క్రాస్ రోడ్‌లోని భవ్యశ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్, పెద్దతండాలోని మెఫీ స్వచ్ఛంద సేవా సంస్థ, బల్లేపల్లిలోని మదర్ తెరిస్సా ఆశ్రమం, నేనున్నాను ఓల్డ్ ఏజ్ హోమ్, నేనున్నాను ఫౌండేషన్ సహా మొత్తం 13 ఆశ్రమాలను విద్యార్థులు సందర్శించారు. సుమారు 500 మంది అనాథలు, వృద్ధులకు అవసరమైన సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవాలని సూచించారు.

కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవలోనూ ముందుండేలా సంస్థ ప్రోత్సహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డాక్టర్ సుదర్శన్, ఏవో వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జి కృష్ణప్రసాద్, విభాగాధిపతులు డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, డాక్టర్ చార్యులు, శ్రీకుమార్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

అనాథ, వృద్ధాశ్రమాలకు శ్రీ చైతన్య విద్యార్థుల సేవా చేయూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News