Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి

14-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నమూనా చెక్కులను అందజేశారు. జిల్లాలో మూడవ విడతగా 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు జమ కాగా, నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలును కలిపి మొత్తం రూ.20 వేలును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Sthanikam

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నమూనా చెక్కులను అందజేశారు. జిల్లాలో మూడవ విడతగా 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు జమ కాగా, నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలును కలిపి మొత్తం రూ.20 వేలును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News