Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:06 AM

ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం

28-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అగ్నిగుండాలు – నంది వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ

రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరల్లో ఒకటిగా గుర్తింపు

కాకతీయ కాలం నుండి ప్రసిద్ధి గాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం జాతర నేటి నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ జాతర రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

జాతర గణపతి పూజతో ప్రారంభమవుతుంది. రెండవ రోజు ధ్వజారోహణం, సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు నిర్వహించనున్నారు. మూడవ రోజు సంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామ పురోహితులు నారాయణ సూరి శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాల నడుమ ఘనంగా జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనే దంపతులు తీర్థప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుని స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారు.

నాలుగవ రోజు అగ్నిగుండాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పురాతన ఆనవాయితీగా కొనసాగుతున్న అగ్నిగుండాలలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. నంది వాహన సేవలో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కోరికలు కోరుకుంటారు. భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం కూడా జరుగుతుంది.ఈ జాతర క్రీడలకు మారుపేరుగా నిలిచింది. కబడ్డీ, ఎడ్ల పందాలు, క్యారమ్స్, కోలాటం, చెస్ వంటి పోటీల్లో విజేతలకు బహుమతులు, నగదు ప్రదానం చేస్తారు. క్రీడాకారులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు జాతరను ఆదివారం ఉదయం నాయకులతో కలిసి ప్రారంభించనున్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తుల సౌకర్యార్థం మిర్యాలగూడ – భీమారం మార్గంలో ఐదు నిమిషాలకు ఒకసారి బస్సు సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయాలు మరింత సుందరంగా అభివృద్ధి చెందుతాయని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News